Dr. Ramachandra 15 Days diet sheet plan as a pdf available to download. You can also read the full 15 days diet sheet plan in this article. According to Dr. Ramachandra Rao, try to use this diet for weight loss, diabetes, cancer patients, thyroid. If you want to meet the Doctor then visit the Prakruthi Ashramam, Nelakondapalli, Khammam.
డా . రామచంద్ర రావు 15 రోజుల డైట్ షీట్ | Dr Ramachandra 15 Days Diet Sheet Plan
👉 ఉదయం ముఖం కడగ గానే రెండు గ్లాసుల నీరు తాగాలి. గంట తరువాత మళ్ళీ రెండు గ్లాసుల నీరు తాగాలి. (చలి మరియు వర్షా కాలంలో గోరువెచ్చగా తాగండి)
👉 టిఫిన్ కి 30 నిమిషాల ముందు గ్లాస్ జ్యూస్ తాగాలి
- క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ (షుగర్ వున్న వాళ్ళు తప్ప అందరూ తాగవచ్చు)
- పుదీనా, కొత్తిమీర, తులసి ఆకు జ్యూస్ (పుదీనా, కొత్తిమీర ఎక్కువగా ఉండాలి, తులసి ఆకు తక్కువగా ఉండాలి)
- తౌడు జ్యూస్ (మిల్లులో తౌడు ను తెచ్చుకోండి)
- పాలకూర, కరివేపాకు జ్యూస్ (ఉప్పు నీళ్లలో పాలకూర ఆకులను 5 నిముషాలు వేసి కడిగి వాడండి)
- మునగ ఆకు జ్యూస్ (ఇందులోకి కరివేపాకును కూడా వేసి జ్యూస్ చేయవచ్చు)
రుచికోసం వీటిలో తేనే, నిమ్మరసం కలిపి తాగండి.
👉 టిఫిన్ కు తేలికైన ఆహారాలు తీసుకోవాలి. నూనెలో వేయించినవి తినవద్దు.
👉 మధ్యాన భోజనానికి 30 నిముషాల ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి. భోజనం ముగిసిన గంటన్నర నుండి ప్రతీ గంటకూ ఒక గ్లాసు నీరు తాగాలి.
👉 అన్నం లో 50 శాతం కూర ఉండేలాగా తినాలి. ఆకు కూరలు ఎక్కువ వాడాలి. ఉప్పు, కారం, నూనెలు బాగా తగ్గించాలి.
👉 కూరల్లో రుచి కోసం పల్లీ పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, మినుముల పొడి కలుపుకోవాలి.
👉 మాంసం, చాపలు, కోడి గుడ్డు, నిల్వ పచ్చడి, బిర్యానీలు, పాకెట్ పాలు వాడవద్దు.
👉 సాయంత్రం నాలుగున్నర గంటలకు గ్లాస్ జ్యూస్ తాగాలి. (పైన చెప్పిన జ్యూస్ లో ఒకటి తాగండి)
👉🏻 సాయంత్రం ఐదున్నర గంటలకు రెండు గ్లాసుల నీరు తాగాలి.
👉 సూర్యాస్తమయం లోపు రాత్రి భోజనం తినడం పూర్తి కావాలి.
👉 ఏవైనా సమస్య ఎక్కువగా వున్న వాళ్ళు రాత్రి భోజనానికి కేవలం పండ్లు తినాలి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, దానిమ్మ, బత్తాయి, కమలా మొదలైనవి తినాలి.
👉 వీలుని బట్టి రోజులో మూడు నుంచి నాలుగు గ్లాసులు మజ్జిగ తాగాలి.