శివ పంచాక్షర స్తోత్రం - Shiva Panchakshara Stotram (Mantra) Lyrics in Telugu, English

Shathish
0

 The Shiva Panchakshara Stotram, also known as the Shiv Panchakshara Mantra, is one of the most popular Shiva mantras. The Shiva Panchakshari Stotram is composed of five letters: "Na Ma Si Va Ya," which is a sacred word chant used to worship Lord Shiv. Each of these 5 letters is considered Lord Shiva in the Shiv Panchakshara Stotra, and Shiva Bhagvan is lauded for his outstanding characteristics.

According to Vedic traditions, anyone who chants the Shiva Panchakshara Stotram with profound devotion will eventually attain Shiv Log (the realm of Shiva).

శివ పంచాక్షర స్తోత్రం లిరిక్స్ ఇన్ తెలుగు

శివ పంచాక్షర మంత్రం అని కూడా పిలువబడే శివ పంచాక్షర స్తోత్రం అత్యంత ప్రసిద్ధ శివ మంత్రాలలో ఒకటి. శివ పంచాక్షరీ స్తోత్రం ఐదు అక్షరాలతో కూడి ఉంది: "న మా సి వా యా", ఇది శివుడిని ఆరాధించడానికి ఉపయోగించే పవిత్ర పదం. ఈ 5 అక్షరాల్లో ప్రతి ఒక్కటి శివ పంచాక్షర స్తోత్రంలో శివునిగా పరిగణించబడుతుంది మరియు శివ భగవాన్ అతని అత్యుత్తమ లక్షణాల కోసం ప్రశంసించబడ్డాడు.

Shiva Panchakshara Stotram Lyrics in Telugu

నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై "న" కారాయ నమః శివాయ


మందాకినీ సలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మై "మ" కారాయ నమః శివాయ


శివాయ గౌరీ వదనాబ్జ బృంద

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ

తస్మై "శి" కారాయ నమః శివాయ


వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మై "వ" కారాయ నమః శివాయ


యజ్ఞ స్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తస్మై "య" కారాయ నమః శివాయ


పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే


భావం


నాగేంద్రుని హారముగా ధరించిన వాడు, మూడు కన్నులు గలవాడు,

పవిత్రమైన బూడిదని ఒళ్లంతా పూసుకొన్న వాడు, మహేశ్వరుడు, నిత్యుడు,

శుద్ధ స్వరూపుడు, నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు,

పంచాక్షరీ మహామంత్రంలో 'న' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.


మందాకిని నదీ జలాలతో పూజింపబడే వాడు, చందనంతో పూయబడిన మేని కలిగిన వాడు

నంది, సకల భూతప్రేతాలకు అధిపతి అయిన మహేశ్వరుడు,

మందారం మరియు అనేక ఇతర పుష్పాలతో పూజింపబడేవాడు,

పంచాక్షరీ మహామంత్రంలో ' మ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.


మంగళ కరుడు, గౌరీ వదనారవిందాన్ని ఉదయింపజేసే సూర్యుడు,

దక్షుని యజ్ఞం నాశనం చేసిన వాడు,

నీలకంఠుడు, వృషభధ్వజుడు,

పంచాక్షరీ మహామంత్రంలో 'శి' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.


వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన మునిశ్రేష్ఠులచే మరియు సకల దేవతలచే పూజింపబడే వాడు,

విశ్వమంతటికీ కిరీటం వంటి వాడు (శేఖరుడు), సూర్య, చంద్ర, అగ్నులను మూడు కన్నులుగా కలిగినవాడు,

పంచాక్షరీ మహామంత్రంలో ' వ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.


యజ్ఞస్వరూపుడు, జటాధరుడు, త్రిశూలం ధరించిన వాడు, సనాతనుడు, తేజస్సు కలవాడు,

నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు,

పంచాక్షరీ మహామంత్రంలో ' య' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.


ఈ పంచాక్షరీ స్తోత్రమును శివసన్నిధిలో జపించువారు, శివలోక ప్రాప్తి కలిగి బ్రహ్మానందులై ఉందురు.

Shiva Panchakshara Stotram Video


Shiva Panchakshara Stotram Lyrics in English

Nagendra haraya Trilochanaya,

Basmanga ragaya maheswaraya,

Nithyaya shudhaya digambaraya,

Tasmai 'Na' karaya namashivaya.


Mandakini salila chandana charchithaya,

Nandeeswara pramadha nadha maheswaraya,

Mandra pushpa bahu pushpa supoojithaya,

Tasmai 'Ma' karaya namashivaya.


Shivaaya gowri vadanara vinda,

Sooryaya daksha dwara naasakaya,

Sri neela kantaya vrisha dwajaya,

Tasmai 'Si' karaya namashivaya.


Vasishta kumbhodhbhava gowthamadhi.

Munendra devarchitha shekaraya,

Chandrarka vaiswanara lochanaya,

Tasmai 'Va' karaya namashivaya.


Yaksha swaroopaya jada dharaya,

Pinaka hasthathaya sanathanaya,

Divyaya devaaya digambaraya,

Tasmai 'Ya' karaya namashivaya.


Phalasruthi


Panchaksharamidham punyam,

Ya padeth Shiva sannidhou,

Shivaloka maapnothi,

Shive na saha modathe.

Tags: sri shiva panchakshari stotram lyrics in telugu, shiva panchakshara nakshatramala stotram lyrics in telugu

Post a Comment

0Comments
Post a Comment (0)