Allergy Symptoms in Telugu, How to Cure Allergy | అలర్జీ లక్షణాలు, ఎలర్జీ ని తగ్గించే చిట్కాలు
Allergy symptoms and how to cure allergy in telugu, blood allergy symptoms in telugu,food allergy symptoms in telugu,skin allergy telugu chitkalu,types of skin diseases in telugu,home remedies for itching in telugu,skin allergy reason in telugu,dust allergy treatment,urticaria treatment in telugu.
మానవ శరీరం ఒక అద్భుతమైన నిర్మాణం. ఎలాంటి ఆహారపదార్థాలు తిన్నా,క్రిములు వచ్చినా కూడా మన శరీరము దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దీనినే రోగనిరోధక శక్తి అంటాము. దీనివలన మన శరీరములోకి వచ్చే గాలి, తాగే నీరు,తినే ఆహారం వలన వచ్చే కొన్ని బాక్టీరియా,వైరస్ లు మన శరీరములోకి వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి.
అయితే కొందరిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన మనకు హానీకలిగించని ఆహారపదార్థాలు తిన్నా కూడా అవి వారికీ పడక Allergy కి దారితీస్తుంది. గాలిలో ఉండే దుమ్ము వలన తుమ్ములు రావటం సహజం కానీ ఈ అలెర్జీ తో బాధపడేవారికి విపరీతంగా రావటం,ముక్కు ఎరుపెక్కడం,ముక్కు నుండి నీరు కారడం అదేపనిగా జరుగుతుంది.
వ్యాధినిరోధక శక్తిని పెంచడం లో సిరిధన్యాలు మరియు ముక్యంగా కాషాయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి వాడే కాషాయాలు, 1. గరిక ఆకు కషాయం, 2. తులసి ఆకు కషాయం, ౩. తిప్ప తీగ ఆకు కషాయం, 4. బిల్వం ఆకు కషాయం, 5. కానుగ ఆకు కషాయం, 6. వేప ఆకు కషాయం, 7. రావి ఆకు కషాయం. మీరు ఈ 7 కషాయలను వారం వారం కానీ 4 రోజులు కానీ తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అలర్జీ లక్షణాలు
- ముక్కు విపరీతంగా కారడం,ముక్కు దిబ్బడ,చీదటం వంటివి ఉంటాయి.
- కళ్ళు ఎరుపుగా మారి,దురద,నీరు కారుతుంది.
- దగ్గు,ఛాతిలో ఇబ్బందికరంగా ఉండి,గురక రావడం.
- చర్మం దురదగా ఉండటం
మనం రోజు వాడే కొన్ని పదార్థాలను ఉపయోగించి అలర్జీ ని తగ్గించుకోవచ్చు. అవి
అలెర్జీలను తగ్గించటంలో వాటర్ మిలన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ మిలన్ లో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనివలన మన శరీరములో ఉండే అనవసరమైన టాక్సిన్స్ ని బయటకు పంపిస్తుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వలన అలెర్జిని నివారించటమే కాకుండా వ్యాధినిరోధక శక్తి ని పెంపొందించటంలో సహాయపడుతుంది.
పెరుగు లో ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్లర్జీ ని తగ్గించటంలో సహాయపడుతుంది. కాబట్టి మనం రోజూ తినే ఆహారంలో పెరుగు తప్పని సరిగా ఉండేలా చూసుకోవటం చాలా అవసరం.
వెల్లుల్లి కూడా మన వ్యాధినిరోధక శక్తినిపెంపొందిస్తుంది. ఇందులో ఇన్ఫలమేషన్ ని తగ్గించే గుణం ఉంటుంది. వెల్లులి మంచి ఆంటిబయోటిక్ గా అల్లర్జీలను తగ్గించటంలో మంచిగా ఉపయోగపడుతుంది. రోజూ రెండు లేదా మూడు వెల్లులి రెబ్బలను అన్నములో కానీ,నేరుగా కానీ తినటం వలన అలెర్జీ సమస్యలు రాకుండా ఉంటాయి.
నిమ్మరసం కి అల్లర్జీ ని తగ్గించే గుణం ఉంటుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు ఆంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అల్లర్జీ తగ్గటానికి రోజూ ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ చొప్పున మూడు పూటలు త్రాగాలి.
పసుపు సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పసుపులో యాంటీ ఇన్ఫలమేటరీ గుణం ఉంటుంది. అందువల్ల అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. దీనికి మీరు ఒక గ్లాసు వేడి పాలు తీసుకోండి అందులో కొద్దిగా పసుపు వేసి రోజు కి రెండు సార్లు తీసుకుంటే అల్లర్జీ తగ్గిపోతుంది
