పెద్దవారిలో విటమిన్ డి తగ్గితే వచ్చే సమస్యలు | D Vitamin Deficiency in Telugu

Shathish
0
విటమిన్ డి లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దవారిలో విటమిన్ డి లోపం అధికంగా వుంటుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే, విటమిన్ డి లోపం కండరాల బలహీనత, పనితీరు తగ్గిపోవటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఏ సమస్యలు లేకుండా వృద్ధాప్యాన్ని గడపాలన్నా, తమ పనులు తాము చేసుకోగలిగే బలంతో, కదలికతో ఉండాలన్నా నియంత్రించగల కండరాల పనితీరును జీవితాంతం బలంగా ఉంచుకోగలటం ముఖ్యమైన విషయం. అది లేకపోతే శరీరం బలహీనపడి ఈ సమస్యలన్నీ వస్తాయి. రకరకాల ఆధారాలను బట్టి చూసినా సరిపడినంత విటమిన్ డి శరీరంలో ఉండటం కూడా సరైన రక్షణ కల్పించవచ్చని తెలుస్తోంది.
Vitamin D deficiency in old age in telugu
అలాగే, విటమిన్ డి లోపం ఉన్న వృద్ధుల్లో (25.2 శాతం) విటమిన్ డి సరిపడినంత ఉన్నవారికన్నా (7.9శాతం) మూడు రెట్లు ఎక్కువ ‘కండరాల పనితీరు’ బలహీనంగా ఉన్నట్లు తెలిసింది. మరింత సంక్లిష్ట గణాంకాల విశ్లేషణ ఆధారంగా, ఈ పరిశోధన విటమిన్ డి లోపమే కండరాల బలహీనతని, పనితీరు సరిగ్గా లేకపోవటాన్ని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది.

విటమిన్ల గురించి  పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
విటమిన్లు ఎన్ని రకాలు | Types of Vitamins in Telugu

D విటమిన్ లోపం ముఖ్యంగా పెద్దవారిలో ఎక్కువగా చూస్తుంటాం. దీనివలన కాళ్ళ నొప్పులు,నడుం నొప్పులు ఉంటాయి.అలాగే ఆడవాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.కాలేయం,ఉదయం పూట వచ్చే సూర్యరశ్మి,,చేపలు,గుడ్లు,చేప నూనె,పాలలో D విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు ముక్యంగా విటమిన్ డి వున్న ఆహార పదార్ధాలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.

Post a Comment

0Comments
Post a Comment (0)