Green Tea Uses and Health Benefits in Telugu

Shathish
0
వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. ఈ అద్భుత డ్రింక్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. దీనిని తాగడం వల్ల మనిషి జీవనకాలం పెరగడంతో పాటు గుండె సమస్యలు దూరమవుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంతో పాటు, చర్మానికి కూడా మంచి జరుగుతుందని తెలుసు.

what are the uses of green tea in telugu

కొంతమంది బ్లాక్ టీని కూడా ఇష్టంగా తాగుతారు. అయితే, బ్లాక్ టీ కంటే గ్రీన్ టీ మెరుగైన ఫలితాలని ఇస్తుందని తేల్చారు పరిశోధకలు. బ్లాక్ టీ తాగితే కొన్ని లాభాలు ఉంటాయని, అయితే, గ్రీన్ టీ తాగడం వల్ల అంతకంటే మెరుగైన ఫలితాలు ఉన్నట్లుగా గుర్తించారు.


అయితే, కేవలం గ్రీన్ టీ తాగడం వల్లే అన్ని బెనిఫిట్స్ ఉండవని చెబుతున్నారు నిపుణులు. ఓవైపు ఈ గ్రీన్ టీ తాగుతూనే.. ఇతర అనారోగ్య అలవాట్లను దూరం చేసుకోవలని సూచిస్తున్నారు. గ్రీన్ టీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ టీ తీసుకోవడంతో పాటు.. తాజా పండ్లు, కూరగాయలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందులో ఎక్కువగా పాలిపెనాల్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా దెబ్బతిన్న కణజాలాన్ని శక్తివంతం చేస్తూ.. బరువుని నియంత్రిస్తుంది. కాబట్టి కచ్చితంగా తమ లైఫ్‌స్టైల్‌లో భాగంగా డైట్‌లో గ్రీన్‌టీని కచ్చితంగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)