స్నానానికి ఏ నీరు ఉపయోగించడం మంచిదంటే | Hot water bath VS Cold water bath in Telugu

Shathish
0

Best water for bathing in telugu| Hot water and Cold water bath benefits &  disadvantages in telugu

చలికాలం మరియు వర్షా కాలంలో చాలా మంది మరిగే నీళ్లను ఒంటి మీద పోసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ, ఇది ఎంత మాత్రం మేలు కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్నానానికి వేడి నీటి కంటే చన్నీళ్లే బెటర్ అంటున్నారు. ఎందుకంటే వేడి నీటితో స్నానం చేయడం వల్ల బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంటుంది. దీని వల్ల నిద్ర వచ్చినట్లు, మత్తుగా ఉంటుంది. దీని వల్ల రోజంతా అలసటగా ఉంటుంది. ఇక ఆఫీస్‌లో పనుల్లో ఉన్నవారు ఈ ప్రభావంతోనే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి ఎంతమాత్రం వేడి నీటిని ఉపయోగించొద్దని చెబుతున్నారు.

స్నానానికి చన్నీళ్లని ఉపయోగిస్తే ఆ ప్రభావం శరీరం బాగా చూపుతుందని చెబుతున్నారు. చన్నీరు ఒంటిపై పడగానే అప్పటి వరకూ ఉన్న నిద్ర మత్తు వదిలిపోతుంది. స్నానం చేసే వరకూ కాస్తా ఇబ్బందిగా ఉన్నా… ఆ తర్వాత బాడీ మొత్తం యాక్టివ్‌గా మారుతుంది. ఈ కారణంగా స్నానానికి వేడినీటి కంటే చన్నీటిని ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. వీటితో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
which bath is better for human body in telugu

వేడి నీటి స్నానం ఎప్పుడు మంచిదంటే..

స్నానానికి వేడి నీటిని ఉపయోగించడం సాయంత్రం వేళల్లో మంచిది. దీని వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. హాయిగా నిద్రపడుతుంది. అలసిన కండరాలు కూడా బాగా రిలాక్స్ అవుతాయి. అయితే, మంచిది కదా అని మరిగే నీటిని కాకుండా గోరువెచ్చని నీరు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉదయం నుంచి పడిన శ్రమ మొత్తం ఒక్కసారిగా తగ్గుతుంది. అలా బెడ్‌పై వాలగానే ఇలా నిద్రపట్టేస్తుంది. కాబట్టి గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి రాత్రి వేళల్లో..

వీరు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి..

అయితే ఇది అందరూ పాటించాలి అంటే కాస్తా కష్టమే. ఎందుకంటే కొంతమంది సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడతారు. అలాంటి వారు చన్నీటి స్నానం చేస్తే సమస్య ఇంకాస్తా ఎక్కువ అవుతుంది. తలనొప్పి, తల పట్టేసినట్టు ఉండడం వంటివి ఎక్కువ అవుతాయి. కాబట్టి వారు ఉదయం కూడా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

ఇక వేసవి కాలంలో అయితే, అందరూ చల్లని నీటితోనే స్నానం చేయడానికి ఆసక్తి చూపుతారు కాబట్టి ఎలాంటి సమస్యలు లేవు.. హ్యాపీగా చల్లని నీటితోనే స్నానం చేయొచ్చు. నిజానికీ వేసవి, చలికాలంలతో పోలిస్తే చలికాలంలోనే ఎక్కువ మంది మత్తులో ఉన్నట్లు ఉంటారు. ఇది మీరు గమనించే ఉంటారు.

Post a Comment

0Comments
Post a Comment (0)