Dengue Fever Symptoms in Telugu Language
వర్షా కాలంలో డెంగ్యూ జ్వరం ఎక్కువగా వచ్చే ప్రమాదం వుంది. దీనికి కారణం, వర్షం వల్ల ఇంటి చుట్టు పక్కల నీరు నిలవ ఉండటమే. ఈ నీటిలో డెంగ్యూని వ్యాప్తి చెందించే దోమలు వుంటాయి. డెంగ్యూ జ్వరం రావడానికి ప్రధాన కారణం ఈడిస్ ఈజిప్టి అనే దోమ మన శరీరాన్ని కుట్టడం వలన వస్తుంది. ఈ దోమ చూడటానికి పెద్దగా నల్లటి చారలతో ఉంటుంది. ఇది ఎక్కువగా ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం వేళల్లో కుడుతుంది.అయితే ఈ దోమ మన శరీరంలోని కాళ్ళు,పాదాలు వంటి క్రింది బాగాలలోనే ఎక్కువగా కుడుతుంది. సాధారణంగా దోమ కుట్టిన 4 నుండి 6 రోజులలో లక్షణాలు మొదలౌతాయి. ఈ దోమ నిలిచి ఉండే నీళ్లలో అనగా మన ఇంట్లో ఉండే నీళ్ల తొట్టిలలో,నీటి సంపులలో,చిన్న చిన్న గుంటలలో ఉంటుంది. కాబట్టి మనం వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. డెంగ్యూ జ్వరం వచ్చిన మొదట్లో కంటే కూడా తగ్గిపోయే సమయంలోనే మనం ఎక్కువగా జాగ్రత్త వహించాలి.
డెంగ్యూ వీరికి ఎక్కువగా వస్తుంది
డెంగ్యూ ఎక్కువగా వయసు ఎక్కువగా ఉన్నవారికి, షుగర్ వ్యాధిగ్రస్తులకి, చిన్నపిల్లలకి ఎ క్కువగా వస్తుంటుంది. వీరిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వ్యాధి వారికే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివారు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడూ టెస్ట్‌లు చేయించుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఎక్కువగా జాగ్రత్త పడాలి.What are the Symptoms of Dengue Fever:
- తీవ్రమైన తలనొప్పి,కళ్ళ వెనకాల నొప్పి.
- కండరాళ్లు,కీళ్లు,వొళ్ళంతా నొప్పులుగా ఉంటుంది.
- వాంతులు,వికారం రావటం.
- శరీరం పైన దద్దుర్లు,ఎర్రటి చుక్కలలాగా ఏర్పడటం.
- నోరు,చిగుళ్ల నుండి రక్తం కారడం.
- రక్తనాళాలలో అంతర్గత రక్త స్రావం ఏర్పడటం.
- తీవ్రమైన కడుపునొప్పి.
- అనుకోకుండా బీపీ పడిపోవడం లేదా పెరగటం వంటి లక్షణాలు కనపడతాయి.
How to cure Dengue Fever:
పైన చెప్పిన లక్షణాలు కనపడగానే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమయములో రోగి కి విశ్రాంతి చాలా అవసరం. కాచి చల్లార్చిన శుభ్రమైన నీటి ని త్రాగాలి ,వేడిగా ఉండే ఆహారపదార్థాలు తినాలి. బొప్పాయి ఆకు రసం రోజు మూడు పూటలా 2 చెంచాల మోతాదులో తీసుకోవాలి, ఈ బొప్పాయి ఆకు రసం ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచటానికి దోహదపడతాయి . ఈ జ్వరంలో మన రక్తంలో ఉండే ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది. సాధారణంగా ప్లేట్ లెట్స్ సంఖ్య 1.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు ఉండాలి. ఇది తెలుసుకోవడాని రోగికి రక్త పరీక్ష చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ డెంగ్యూ నివారణకు ఎటువంటి టీకాలు గాని,ఆంటిబయోటిక్స్ గాని అందుబాటులో లేవు. కానీ డెంగ్యూ లక్షణాలు కనపడగానే డాక్టరుని సంప్రదించాలి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటె డాక్టర్ సూచన మేరకు అడ్మిట్ కావలసి ఉంటుంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- జ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుంది. కాబట్టి ముందు వాటిని తరిమేయాలి.
- ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడాలి, చీకటి పడగానే తలుపులు, కిటికీలు వేసుకోవాలి.
- చుట్టుపక్కలా నీటి గుంటలు, చెత్త లేకుండా జాగ్రత్త పడాలి.
- పడుకునేపటప్పుడు కాళ్లు, చేతులు, శరీరాన్ని కవర్ చేసుకోవాలి.
- ఒంటికి వేప నూనె రాయాలి. కేవలం అది మాత్రమే రాసుకోవడం ఇబ్బందిగా అనిపించి వాసనగా అనిపిస్తే కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవచ్చు.
- చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఒంటికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి పూసుకో వడం వల్ల ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు.
- దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు కాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
- ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
- పూలకుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల దోమలు ఎక్కువ కాకుండా ఉంటాయి.
