Thati Bellam Uses in Telugu | తాటి బెల్లం ఉపయోగాలు

Shathish
0

Thati Bellam Health Benefits in Telugu / Thati Bellam Upayogalu

మనం రోజు వాడే పంచదార లో గ్లూకోస్ మరియు ఫ్రక్టోస్ అధిక మోతాదులో వుంటాయి. రోజు అందరు ఈ చక్కర ను మోతాదుకు మించి తీసుకుంటున్నారు. తాటి బెల్లం చెక్కర కు అద్బుతమైన ప్రత్యామ్న్యాయం అని చెప్పుకోవచ్చు.  చక్కర ను చెరకు నుండి తాయారు చేస్తారు. ఇలా చేసేటపుడు దానిలో వున్న పోషకాలు అన్ని పోతాయి. తాటి బెల్లం ను నేరుగా తాటి చెట్టు నుండి వచ్చిన కల్లు నుండి తయారుచేస్తారు.
thati bellam upayogalu

తాటి బెల్లం ఉపయోగాలు | Thati Bellam Benefits

  • అదిక బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది
  • రక్త హీనతను నివారిస్తుంది
  • శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది
  • మలబద్ధకం ను నివారిస్తుంది
  • క్యాన్సర్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది
  • ఆహరం జీర్ణం అయ్యేలా చేస్తుంది
ఒక గిన్నెలో కొన్ని మంచి నీళ్ళు పోసి, తాటి బెల్లం 2 ముక్కలను వేసి కొద్ది సేపు వేడి చేయాలి. ఇలా వచ్చిన నీళ్ళను ఉదయాన్నే తీసుకోవడం వలన పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.

రోజు ఉదయాన్నే తాటి బెల్లం ను తీసుకోవడం వలన శరీరానికి కావలసిన గ్లూకోస్ ను అందిస్తుంది. దీనివలన మనకు అతి ఆకలి కాకుండా వుంటుంది. దీని వలన అధిక బరువు కాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతేకాకుండా రోజు మొత్తం శరీరానికి కావలసిన శక్తి ని అందిస్తుంది. ప్రస్తుతం అందరినకి  ముక్యంగా మహిళలకి వచ్చే రక్త హీనత ను నివారించడం లో తాటి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. అజీర్ణ సమస్య వున్నవారికి తాటి బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బయంకరమైన క్యాన్సర్ లు రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు వున్న తాటి బెల్లం ను చక్కరకు బదులు వాడండి.

అలాగే తాటి బెల్లం తో నువ్వుల లడ్డు, పల్లి లడ్డు లను చేసుకొని తినవచ్చు. ఈ లడ్డులను వారానికి ఒకసారి తింటే రక్తం లో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వలన తరచు వచ్చే జలుగు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు రాకుండా వుంటాయి. ముక్యంగా చిన్న పిల్లలకు ఇవి తినిపించాలి.

తాటి బెల్లం నువ్వుల లడ్డు తయారు చేయడం ఎలా | How to Make Thati Bellam Nuvvula Laddu

Thati bellam nuvvula laddu thayari
తాటి బెల్లం ను చిన్న ముక్కలుగా చ్చేయాలి. నువ్వులను దోరగా ఇనుప పెనం మీద వేయించాలి. ఈ రెండింటిని కలిపి మిక్సి వేసుకోవాలి. ఇలా వచ్చిన దానిని లడ్డు లాగ చేసుకోవాలి.

తాటి బెల్లం ను అమెజాన్ లో కొనడానికి ఈ కింద వున్న లింక్ ను క్లిక్ చేసి కొనండి. 

Post a Comment

0Comments
Post a Comment (0)