థైరాయిడ్ లక్షణాలు | Thyroid Symptoms in Telugu

Shathish
0

థైరాయిడ్ లక్షణాలు | Thyroid Symptoms in Telugu

థైరాయిడ్ ఈ రోజుల్లో, క్షీణిస్తున్న జీవనశైలి కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా అందులో ఒకటి థైరాయిడ్. ఒక సర్వే ప్రకారం, భారతదేశంలో 4.2 మిలియన్ల మంది థైరాయిడ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు థైరాయిడ్ సమస్య ఎంత అధికంగా ఉందో  థైరాయిడ్ ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ వ్యాసంలో థైరాయిడ్ ఆహారం గురించి తెలుసుకుందాం.
Thyroid lakshanaalu
కానీ ఈ థైరాయిడ్ సమస్య మనకు ఉంది అని తెలుసుకునే లక్షణాలు ఎవ్వరు సరిగ్గా అంచనా వేయలేరు. దాదాపుగా కొంత మందిలో ఈ వ్యాధి ఎప్పుడో వచ్చి ఉంటది, ఏదైనా వ్యాధి ట్రీట్మెంట్ గురించి డాక్టర్ వద్దకు వెళ్తే అ డాక్టర్ మిమ్మల్ని చూసి,అనుమానించి పరీక్షలు రాస్తే అప్పుడు థైరాయిడ్ వ్యాధి ఉంది అని తెలుస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందువల్ల మనకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. అలాంటి కొన్ని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

1.అధిక బరువు:
అధిక బరువు వల్ల కూడా ఈ సమస్య రావటానికి అవకాశం ఉంటుంది. అయితే బరువు వున్నవారందరికీ ఈ సమస్య ఉండకపోవచ్చు,అలాంటప్పుడు ఎలా గుర్తించాలి? సాధారణంగా బరువు పెరిగేవారు ఒకేసారి పెరగరు,ఒక నెలలో 1 నుండి 2 కిలోలు పెరుగుతారు. కానీ ఒక నెలలో 4నుండి 5 కిలోలు ఒకేసారి పెరిగితే థైరాయిడ్ సమస్య ఉంది అని గుర్తించి వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన పరీక్షలు చేసుకోవాలి. అంటే తక్కువ సమయంలో బరువు పెరిగినా ఈ సమస్య ఉంది అని అనుమానించాలి.

2.అలసి పోవటం:
మామూలుగా ఒక మనిషికి రోజు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం అవుతుంది. కానీ కొందరు 10 నుండి 12 గంటలు పడుకుంటారు,ఇలాంటి వారికీ ఈ విధమైన అలసట ఉండకూడదు. ఒక మనిషికి సరిపడినంత నిద్ర ఉన్నా కూడా అలసట ఎక్కువగా ఉంటే థైరాయడ్ ఉంది అని అనుమానించాలి.

3.మలబద్దకం:
తరచూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నా కూడా ఈ వ్యాధికి ఒక సంకేతం. ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవటానికి సరయిన ఆహార జీవనశైలి,తగిన మందులు వాడినా కూడా మలబద్ధకం సమస్య అలానే ఉంటె థైరాయడ్ సమస్యకి సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి.

4.నెలసరి 
మహిళల్లో ఈ నెలసరి సరిగ్గా లేకున్నా ఈ సమస్య రావచ్చు. మాములుగా ప్రతీ మహిళకి నెలసరి అనేది సర్వ సాధారణం. అయితే ఎప్పుడైతే శరీరంలో జరిగే హార్మోన్స్ హెచ్చు తగ్గుల వలన నెలసరి సరిగ్గా జరగదో ,అప్పుడు ఈ థైరాయిడ్ కి సంబంధించిన పరీక్షలు చేసుకోవటం వలన ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స చేయించుకోవాలి.

5.జుట్టు అధికంగా రాలటం:
జుట్టు రాలడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం,విటమిన్స్ లోపం,డిప్రెషన్ వలన కూడా జుట్టు రాలుతుంది. కానీ కొందరిలో ఎంత మంచి ఆహారం తిన్నా,ట్రీట్మెంట్ చేయించుకున్నా జుట్టు రాలె సమస్య తగ్గదు. అలాంటి వారిలో థైరాయిడ్ సమస్య ఉండే అవకాశం ఉంటుంది.

Tags: thyroid symptoms in telugu videos,thyroid lakshanaalu, thyroid symptoms in telugu wikipedia,thyroid symptoms in telugu pdf,thyroid cancer symptoms in telugu,thyroid wikipedia in telugu,thyroid diet in telugu pdf,thyroid treatment in home remedies in telugu,ayurvedic treatment for thyroid in telugu
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)