Back Pain and Neck Pain Natural Remedies in Telugu. How to cure Neck & Back Pain Instantly
మెడ నడుము నొప్పి ఈ రోజుల్లో బాగా వినిపిస్తున్న సమస్య. దీనికి హోమ్ రెమెడీ ఏమన్నా ఉందా అని అందరూ అడుగుతూ ఉంటారు. మెడనొప్పి నడుము నొప్పి అనేది మెకానికల్ ప్రాబ్లం, అంటే మనం రోజూ చేసే పనులలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, కూర్చోవడం, నడవడం, పడుకోవడం, డ్రైవింగ్ చేయడం, ముందుకు వంగడం, స్నానం చేయడం ఇలాంటి పనులలో జాగ్రత్తలు తీసుకోకపోతే మెడనొప్పి నడుము నొప్పి వస్తూ ఉంటాయి. ఇంకా కండరాలు అధిక ఒత్తిడికి గురవడం వల్ల మెడనొప్పి నడుము నొప్పి వస్తుంది. నొప్పి వచ్చిన ప్రాంతంలో రక్తప్రసరణ పెరిగితే ఆ నొప్పులు తగ్గిపోతాయి. దీనికి అందరూ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. కానీ పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడడం వలన కిడ్నీలు పాడవుతాయి మరియు Acidity పెరుగుతుంది.
Cure neck and back pain instantly remedies in telugu
ఇటువంటి పెయింట్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. మరి మనం నొప్పి తగ్గించడానికి ఇంట్లో చేసుకునే రెమెడీస్ గురించి తెలుసుకుందాం. నడుము మరియు మెడ నొప్పిని తగ్గించే మన ఇంట్లో దొరికే ఔషధం ఆవాలు. సాధారణంగా వంటల్లో పోపు కోసం వాడే ఆవాలు మెడ మరియు నడుము నొప్పిని తగ్గిస్తాయి.
ఆవాలను మెడ మరియు నడుము నొప్పి తగ్గించడానికి ఎలా వాడాలో తెలుసుకుందాం.
కొన్ని ఆవాలను తీసుకుని రోట్లో వేసి రుబ్బుకోవాలి. కొంచెం నీళ్లు కలిపి మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంతవరకు రుబ్బాలి. ఆవాలను నూరడం వలన ఘాటు అధికంగా వస్తుంది. ఆ పేస్ట్లా అయిన మిశ్రమాన్ని ఒక బట్ట కు పట్టించండి. ఇలా పట్టించిన బట్టను మీకు ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ వేయండి. ఆవాల పేస్ట్ శరీరానికి తగిలేటట్టు వేయండి. దానిమీద అ ఒక పొడి బట్ట వేసి చుట్టేయండి. ఇలా చేసిన తర్వాత వెల్లకిలా పడుకోండి. ఇలా అరగంట సేపు అలాగే ఉంచాలి. కొంతమంది చర్మము సున్నితంగా ఉంటుంది. అటువంటి వారికి ఎప్పుడు మంట మొదలవుతుందో అప్పుడు వెంటనే తీసేయాలి. మీరు ఆ గుడ్డ ను తీసేసిన తర్వాత నొప్పి వున్న ప్రదేశంలో ఎర్రగా అవుతుంది. దీనర్థం ఆ ప్రదేశంలో రక్తప్రసరణను అధికంగా జరిగిందని. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆవాలు వేడి పదార్థం. అధిక వేడి వలన రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఉబ్బుతాయి. ఇలా జరిగిన తర్వాత ఆ నొప్పి నుండి త్వరగా ఉపశమనం జరుగుతుంది. దీనిని ఇంగ్లీష్ లో mustard pack అని అంటారు.
Tags: neck pain remedies, neck pain remedies in telugu, neck pain remedies home, neck pain treatment, back pain remedies, back pain remedies in telugu, back pain relief in telugu, back pain relief tips in telugu, back pain treatment natural tips, Back and Neck pain cure with natural remedies home in telugu, Back, Neck pain Instantly in Telugu by Natural tips, How to cure neck,back pain natural in telugu, Cure neck and back pain instantly remedies in telugu by dr madhu babu

