నిమ్మరసం వలన కలిగే ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు | Lemon Juice Benefits & Side Effects in Telugu

Shathish
0

Lemon Juice Benefits & Side Effects in Telugu

This article is about what are the uses and side effects of lemon juice in telugu.

మనం ఆహరం తీసుకునేటపుడు ఉప్పు తగ్గించాలి అని చెపుతున్నాం. ఎందుకంటే ఉప్పు వచ్చే అనర్ధాలు ఎక్కువ అని అందరికి తెలుసు. మరి ఉప్పు బదులు నిమ్మ రసం తీసుకోమని కూడా చెప్తారు. కానీ మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఉప్పు ఎలా అయితే మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయో అలాగే నిమ్మ రసం అధికంగా తీసుకుంటే కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. 


ఈరోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి పొద్దున్నే నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే చాలా మంది నిమ్మకాయ ను మొత్తం ఒక గ్లాసు నీళ్లలో పిండుకొని తేనె కలుపుకొని తాగుతారు, ఇంకా కొంత మంది నీళ్లు కూడా కలపకుండా ఒట్టి నిమ్మరసం మరియు తేనె కలుపుకొని తాగుతారు. మోతాదుకు మించి నిమ్మరసం తీసుకోవడం వలన ఆ నిమ్మరసమే Acidic అవుతుంది. దీనివల్ల అసిడిటీ వచ్చే ప్రమాదం వుంది. 


దీనికి కారణం ఏంటంటే నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా నిమ్మ రసం ఒక చుక్క కింద నేలమీద పడినపుడు చుడండి,  ఆ చుక్క పడిన ప్రాంతం మొత్తం మరక లాగా అవుతుంది. ఆ మరకను వెంటనే తుడవకుంటే ఆ మారక ఎప్పటికీ అలాగే ఉంటుంది మరియు మీరు ఒక చుక్క నిమ్మరసం ను మీ చర్మం మీద వేసుకొని చుడండి, వెంటనే మంట (skin irritation) వస్తుంది. అటువంటిది మనం డైరెక్ట్ గా మన శరీరంలో కి తీసుకుంటే ఎలా ఉంటుంది, అందులోకి పొద్దున్నే పర గడుపున తీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి.

Lemon Juice Uses and side effects in telugu

మరి నిమ్మరసం ను ఎలా తీసుకోవాలి | How to drink Lemon Juice in a Proper Way

అందుకే నిమ్మరసం తీసుకోవడానికి కూడా కొన్ని జాగ్రత్తలు వున్నాయి. మీరు నిమ్మరసం డైరెక్ట్ గా తీసుకుంటే మీ పళ్ళు పాడవుతాయి. నిమ్మ లో వున్న ఆమ్లత్వానికి (Acidic Nature) పళ్ల మీద వున్న ఎనామిల్ దెబ్బతింటుంది. పళ్ళ మీద మరకలు రావడం, గీతలు పడ్డట్టు ఉండడం, విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. అందుకే నిమ్మరసాన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తీసుకోకుండా నీళ్లలో కలిపి తీసుకోవడం మంచిది. 


నీళ్లలో కలపగానే అది ఆల్కలైన్ అవుతుంది.  అంటే pH వాల్యూ 7 కంటే ఎక్కువగా ఉంటే అది ఆల్కలైన్ అని, 7 కంటే తక్కువగా ఉంటే అసిడిక్ అని అంటారు. ఈ pH అనేది మన నీళ్లలో మరియి మన రక్తం లో కూడా ఉంటుంది. ఆల్కలైన్ వున్న పదార్దాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి నిమ్మరసం ఎప్పుడైనా పావు గ్లాసు ఉంటే దాంట్లో ముప్పావు గ్లాసు నీళ్లు కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మన పళ్లకు, పొట్టకు మరియు చర్మానికి ఏమి కాదు. అల్సర్లను కూడా తగ్గించే సామర్ధ్యం దీనికి ఉంటుంది. అలా కాకుండా మొత్తం నిమ్మరసం తీసుకుంటే అదే అల్సర్ ను సృష్టిస్తుంది. 


పుల్లగా వున్న ఎటువంటి పదార్థాలైనా మనం తీసుకున్నప్పుడు పళ్ళు జివ్వు మనడం జరిగితే ఆ పదార్థాన్ని చిక్కగా కాకుండా పలుచగా తీసుకోవాలి. ఇదే నిమ్మరసాన్ని ఒక గ్లాస్ నీళ్లలో 8 నుంచి 10 చుక్కలు వేసి తీసుకోవాలి. ఇలా చేస్తే ఆ నీళ్లు ఆల్కలైన్ అవుతాయి. అంటే దానర్థం దాన్లో వున్నా ఆమ్లత్వం పోయి ఆల్కలైన్ అవుతుంది. నిమ్మరసాన్ని మీరు ఎప్పుడైనా ఇలాగె తీసుకోవాలి. 

Tags: lemon juice benefits, lemon juice ph, lemon juice uses, how to use lemon juice in proper way, lemon juice benefits in telugu, lemon juice side effects in telugu, lemon juice bad effects, is lemon juice is acidic, what is the ph for lemon juice, what is ph in telugu, how to know ph value in telugu

Post a Comment

0Comments
Post a Comment (0)